
ఊరికి బస్సులు వేయండి
● ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో
ప్రజల వినతి
నెహ్రూసెంటర్: ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆర్టీసీ డీఎం ఎం.శివప్రసాద్‌తో మాట్లాడిన ప్రజలు మా ఊరికి బస్సు వేయండంటూ కోరారు. ఈసందర్భంగా డీఎం మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుంచి 15 మంది ఫోన్ చేసి కొత్త బస్సు సర్వీసులు, అదనపు ట్రిప్పులు నడపాలని కోరినట్లు తెలిపారు. మహబూబాబాద్, మరిపెడ మీదుగా హైదరాబాద్, మహబూబాబాద్ నుంచి వంతడపల బస్సు సర్వీసు నడిపించాలని కోరినట్లు డీఎం తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచి నడిపించేందుకు చర్యలు చేపడుతామన్నారు.