
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
మహబూబాబాద్: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. టీబీ నివారణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ప్రతినెలా షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని వసతి గృహల్లో సెలవుల అనంతరం విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలు అందచేయాలన్నారు. వేసవి, అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు వ్యాధులబారిన పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్‌ఓ భూక్య రవి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్