
చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలి
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
మహబూబాబాద్: జిల్లాలో గత వానాకాలం భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో గురువారం ఇరిగేషన్‌శాఖ డీ ఎస్‌ఈ వసంత్‌కుమార్, డీఈలు రమేశ్, చిట్టిబాబు ను రవీందర్‌రావు కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కొన్ని చెరువుల కట్టలు తెగిపోయాయని, వాటితో ప్రమాదం పొంచి ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా జిల్లాలో పర్యటించి కొన్ని చెరువులను సందర్శించినా అధికారులు ఆ పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. చెరువుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకెళ్లి మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న, నాయకులు ఎడ్ల వేణుమాధవ్, జేరిపోతుల వెంకన్న, కన్నా, కర్పూరపు గోపి తదితరులు పాల్గొన్నారు.