
ప్రపంచ వారసత్వ సంపదను కాపాడుకోవాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ప్రొఫెసర్ పాండురంగారావు పిలుపునిచ్చారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని శుక్రవారం రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ సంపద ప్రాముఖ్యతను తెలియజేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడారు. ప్రపంచ పటంలో రామప్పను తీసుకెళ్లేందుకు అహర్నిషలు కృషి చేశామన్నారు. వెంకటాపురం మండల కేంద్రం శివారులో సింగరేణి చేపట్టే ఓపెన్‌కాస్ట్ గనితో రామప్ప ఆలయానికి, సరస్సుకు ముప్పు ఉందన్నారు. ఓపెన్‌కాస్ట్ గనితో భూమిలోని పొరల కదలికల వల్ల ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే ఓపెన్‌కాస్ట్ గని అనుమతులను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, ఎన్‌ఐటీ డైరెక్టర్ ఎన్‌ఆర్‌సీ రెడ్డి, ప్రొఫెసర్లు దేవప్రతాప్, సాంబయ్య, గణపతి, సేవా టూరిజం కల్చరల్ సొసైటీ ఫౌండర్ కుసుమ సూర్యకిరణ్, రామప్ప పరిరక్షణ సమితి కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్‌రావు, గైడ్ వెంకటేశ్ పాల్గొన్నారు.
డీజిల్ దొంగల అరెస్ట్
పరకాల: కొంతకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లలో అర్ధరాత్రి వేళల్లో డీజిల్ కొట్టించుకుని డబ్బులివ్వకుండా పారిపోతున్న ముఠాను పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐ క్రాంతికుమార్ వివరాలు వెల్లడించారు. ముగ్గురు యువకులు ఉమ్మడి జిల్లాలోని రాయపర్తి, జఫర్‌గడ్ పెట్రోలు బంక్‌లతోపాటు పరకాల పట్టణంలోని హుజూరాబాద్ రోడ్డులో గల హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు కియా సైరీస్ కారులో గత నెల 25వ తేదీన వేర్వేరు సమయాల్లో వచ్చారు. రెండు క్యాన్‌లలో డీజిల్ పోయించుకొని ఫోన్ పే చేస్తామంటూ డబ్బులు ఇవ్వకుండానే పారిపోయారు. బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. గాలింపు చేపట్టగా దోపిడీ కోసం వినియోగించిన కారుతోపాటు ముగ్గురు యువకులు పట్టుపడ్డారు. పట్టుబడిన నిందితుల్లో వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన ఏనుగుల రంజిత్, హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన రేవూరి నవీన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలానికి చెందిన కోడిరెక్క భరత్ చంద్ర ఉన్నట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. నిందితులనుంచి కారుతోపాటు 4 సెల్‌ఫోన్‌లు, రూ.12,500 నగదు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో పరకాల ఎస్‌ఐ శివకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు
ప్రొఫెసర్ పాండురంగారావు

ప్రపంచ వారసత్వ సంపదను కాపాడుకోవాలి

ప్రపంచ వారసత్వ సంపదను కాపాడుకోవాలి