దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ 5 ఏళ్ల లా కోర్సులో తాత్కాలిక పద్ధతిన వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్‌ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుదర్శన్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సోషియాలజీ (1), పొలిటికల్‌ సైన్స్‌(1), లా సబ్జెక్టుల్లో బోధనకు(ఆరు) వేకన్సీలు ఉన్నట్లు తెలిపారు. ఎల్‌ఎల్‌ఎం, /ఎంఏ 55శాతం మా ర్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. నెట్‌/సెట్‌ పాస్‌ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసినవారు అర్హులని తె లిపారు. దరఖాస్తులను హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ లా కాలేజీలో ఈనెల 8వ తేదీ వరకు అందజేయాలని పేర్కొన్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతోపాటు టీచింగ్‌ అనుభవం సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది పార్ట్‌టైం నియామకం కాదని, వన్‌టైం సింగిల్‌ అరెంజ్‌మెంటుగా తాత్కాలిక పద్ధతిలో(2024–25)విద్యాసంవత్సరానికే (సెమిస్టర్‌) నియామకని పేర్కొన్నారు. ఒక సబ్జెక్టులో పేపర్‌వైజ్‌ ఐదు యూనిట్స్‌ సిలబస్‌ బోధిస్తే రెమ్యూనరేషన్‌ రూ.20వేలు చెల్లిస్తారని సుదర్శన్‌ తెలిపారు.

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ఒకరి అరెస్టు, ఇద్దరు పరార్‌

రూ.10,500, సెల్‌ఫోన్‌ స్వాధీనం

గీసుకొండ: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్‌ టీ–20 మ్యాచ్‌లపై బెట్టింగ్‌ చేస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి దాడులు జరిపారు. గీసుకొండకు చెందిన యాదగిరి గిరిధర్‌, దౌడు నితిన్‌, వంచనగిరికి చెందిన కావటి రాకేశ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లో జట్ల గెలుపోటములు, బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే వారిపై బెట్టింగ్‌ పెడుతున్న సమాచారాన్ని విశ్వసనీయంగా తెలుసుకుని వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో దౌడు నితిన్‌, కావటి రాకేశ్‌ పరారు కాగా.. యాదగిరి గిరిధర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.10,500, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును గీసుకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై దిలీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోండి..

విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా గురుకుల విద్యాలయ జూనియర్‌ కళాశాలల్లో 2025–26లో ప్రవేశాలకు టీజీఆర్‌జేసీ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని టీజీఆర్‌జేసీ హసన్‌పర్తి గురుకుల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్‌ ఇందుమతి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈఏడాది మార్చి–ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు http:tgrjc. cgg.govt. inలో చూడాలని తెలిపారు. ఇతర వివరాలకు 040–2473 4899, 98665 59727 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement