వైభవంగా శ్రీవారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి కల్యాణం

Mar 16 2025 12:52 AM | Updated on Mar 16 2025 12:52 AM

వైభవంగా శ్రీవారి కల్యాణం

వైభవంగా శ్రీవారి కల్యాణం

మహబూబాబాద్‌ రూరల్‌: అనంతాద్రి శ్రీవారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనంతాద్రి గుట్టపై వెలసిన స్వయంభూ జగన్నాథ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో అష్టోత్తర శతనామపూజ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి యజ్ఞోపవీతధారణ చేసి, స్వామివారు, అమ్మవార్లకు జిలకర బెల్లంధారణ చేసి మధుపర్కం సమర్పణ అనంతరం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. మానుకోటతోపాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. మాలె కాళీనాథ్‌, వసంతలక్ష్మి దంపతులు వెండి కిరీటాలు, దీక్షా వస్త్రాలు, బవిరిశెట్టి వంశీకృష్ణ, మాధవి పట్టువస్త్రాలు, బొల్లం యాకయ్యలింగం, భారతలక్ష్మి, నాగేశ్వరరావు, సరస్వతి, చందా కిరణ్‌ కుమార్‌, రవిశంకర్‌ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యు డు నాయిని ప్రభాకర్‌రెడ్డి, వేమిశెట్టి యకాంబ్రం, పుల్లఖండం వేణుగోపాల్‌, మల్యాల రంగారావు, అ ర్చకులు అనిరుద్‌ ఆచార్యులు, విశ్వం, మట్టపల్లి వి జయ్‌, గౌతమ్‌, చరణ్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement