బస్సులో వెళ్లినా బతికేవారేమో! | - | Sakshi
Sakshi News home page

బస్సులో వెళ్లినా బతికేవారేమో!

Mar 14 2025 1:27 AM | Updated on Mar 14 2025 1:28 AM

ఖానాపురం: అమ్మా, పెద్దమ్మా.. బస్సులో వెళ్లినా బతికేవారేమో.. లోపలికి వెళ్తాం.. దేవాలయం వద్ద కారు ఆపమన్నప్పుడు ఆపినా బతికేవారేమో అంటూ మృతదేహాల మీద పడి కుమారులు, కుమార్తె రోదించిన తీరు పలువురిని కంటతడికి గురి చేసింది. టైర్‌ పగిలి కారు పల్టీకొట్టి డివైడర్‌ను ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథ నం ప్రకారం.. ఖిలావరంగల్‌కు చెందిన ఏసిరెడ్డి యశోద(80), బోలుగొడ్డు మాణిక్యమ్మ(78) అక్కాచెల్లెలు. కుటుంబ సభ్యులతో కలిసి మహబూ బాబాద్‌ జిల్లా కురవిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కాచెల్లెలు బస్సులో వెళ్దామని అనుకున్నారు. ఇదే కార్యానికి వచ్చిన యశోద కుమారుడు రమేశ్‌ కారులో వెళ్దామని చెప్పాడు. దీంతో యశోద, మాణిక్యమ్మ కుమార్తె అనిత, కుమారుడు హరీశ్‌బాబు, మాణిక్యమ్మ కారులో బయలుదేరారు. కురవిలో దేవాలయం వద్ద ఆగుదామనుకున్నారు. కానీ ఆలస్యమవుతుందనే కారణంతో ఆగకుండా ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఖానా పురం మండలం ఐనపల్లి శివారులోని పెట్రోల్‌బంక్‌ వద్దకు రాగానే కారు వెనుక టైర్‌ పగిలింది. దీంతో అదుపుత ప్పి దూసుకెళ్లే క్రమంలో మరో టైర్‌ పగిలి పల్టీకొడుతూ జాతీయరహదారి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అక్కాచెల్లెలతో పాటు కారు నడుపుతున్న రమేశ్‌, అనిత, హరీశ్‌బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యశోద, మాణిక్యమ్మ మృతిచెందారు. మృతదేహాలను నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్‌, నర్సంపేట రూరల్‌ సీఐ సా యిరమణ, ఎస్సై రఘుపతి సందర్శించి వివరాలు సేకరించి పోస్టుమార్టం తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. అక్కాచెల్లెలు మృతి చెందడంతో ఖిలావరంగల్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

మాణిక్యమ్మ(ఫైల్‌)

టైర్‌ పగిలి డివైడర్‌ను ఢీకొన్న కారు

అక్కాచెల్లెలు దుర్మరణం..

ముగ్గురికి స్వల్ప గాయాలు

ఖానాపురంలో ఘటన

బస్సులో వెళ్లినా బతికేవారేమో! 1
1/1

బస్సులో వెళ్లినా బతికేవారేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement