తేనెటీగలను పరిరక్షించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తేనెటీగలను పరిరక్షించుకోవాలి

Mar 13 2025 7:45 PM | Updated on Mar 13 2025 7:45 PM

తేనెటీగలను పరిరక్షించుకోవాలి

తేనెటీగలను పరిరక్షించుకోవాలి

గూడూరు: ప్రస్తుతం తేనె వినియోగం పెరిగిందని, తేనెటీగలు అంతరించిపోకుండా పరిరక్షించుకోవాలని డాక్టర్‌ సునీత అన్నా రు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నేషనల్‌ బి బోర్డు ఆర్థిక సహకారంతో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపై రైతులకు జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు నువ్వులు, ఆవాలు, కుసుమ, కంది పొలాల్లో తేనెటీగల పెట్టెలను అమర్చి లాభాలను పొందవచ్చన్నారు. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన, స్వచ్ఛమైన తేనె దొరుకుతుందన్నారు. అంతటా తేనె వినియోగం పెరిగిందని, ఉత్పత్తి జరగడంలేదన్నారు. అందుకే ప్రభుత్వం కూడా తేనెటీగల పెంపకం, ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త పి.రజనీకాంత్‌, గూడూరు డివిజన్‌ అటవీశాఖ అధికారి చంద్రశేఖర్‌, డీఏఓ విజయనిర్మల, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ అబ్దుల్‌మాలిక్‌, ఏఈఓ వినయ్‌, శ్రీనేచురల్‌ హానీ ఫౌండర్‌ సంజన, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement