
రైతులకు అందుబాటులో ఉండాలి
మహబూబాబాద్ రూరల్: వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి క్లస్టర్ పరిధిలోని సండ్రలగూడెం రైతు వేదికను డీఏఓ విజయనిర్మల బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ యాసంగిలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, వ్యవసాయ సాంకేతిక అధికారి రాజు, ఏఈఓ రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
పరిష్కారం చూపాలి
గూడూరు: రైతు వేదికలో రైతులకు పంటల సాగు, చీడపీడల నిర్మూలనకు అవసరమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అధికారులకు సూచించారు. మండలంలోని బొద్దుగొండ రైతు వేదికను బుధవారం ఆమెతో పాటు మహబూబాబాద్ ఏడీఓ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాల రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్‌మాలిక్, బొద్దుగొండ ఏఈఓ మనోజ్‌కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.