నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి

Mar 7 2025 9:39 AM | Updated on Mar 7 2025 9:34 AM

గార్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి దేశీరామ్‌నాయక్‌ ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను ఆదేశించారు. గురువారం గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వసతిగృహంలోని బెడ్‌రూమ్‌లు, టాయిలెట్స్‌, బాత్‌రూమ్‌లను సందర్శించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట హెచ్‌ఎం సీహెచ్‌ జోగయ్య, వార్డెన్‌ రాధిక, బుచ్చానాయక్‌, ఉపాధ్యాయులు ఎల్లయ్య, గంగావత్‌ శ్రీనివాస్‌, రుక్కి, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి మణుగూరు

సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌

గార్ల: గార్ల రైల్వేస్టేషన్‌లో నేటి నుంచి మణుగూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదల చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గార్లలో మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదలకు కృషి చేసిన ఎంపీలు పొరిక బలరాంనాయక్‌, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కోరం కనకయ్యలకు గార్ల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షలు షురూ

మహబూబాబాద్‌ అర్బన్‌: పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బా లికల పాఠశాలను విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్‌రెడ్డి గురువారం సందర్శించి విద్యార్థుల పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రీ ఫైనల్‌ పరీక్షలను బట్టి విద్యార్ధుల సామర్థ్యాలు తెలిసిపోతా య ని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక నిఘాతో సబ్జెక్ట్‌ల వారీగావిద్యను బోధించాలన్నారు. ఈ ఏడాది టెన్త్‌ వార్షిక పరీక్షల్లో జిల్లాను ఆగ్రగామి గా నిలిపేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సైన్స్‌ అధికారి అప్పారావు, ఏఎంఓ చంద్రశేఖర్‌ఆజాద్‌,ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పంటమార్పిడితో

అధిక దిగుబడి

మహబూబాబాద్‌ రూరల్‌: పంట మార్పిడితో అధిక దిగుబడి వస్తుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయిల్‌ పామ్‌, మల్చింగ్‌ విధానం, తీగజాతి పద్ధతిలో కూరగాయలు సాగు చేసిన రైతులతో మరి యన్న మాట్లాడారు. ఆయిల్‌ పామ్‌ గెలల ధరలు పెరిగాయని, గెలలు ఒక టన్నుకు రూ.20,871 పలుకుతుందన్నారు. ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, పంట మా ర్పిడితో అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోట లు జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫ లం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్‌ ఫ్రూట్‌, కూరగాయలు, ఆకు కూరలు, తదితర పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు శాంతి ప్రియదర్శిని, శాంతిప్రియ, మానస,రైతులు మాలోతు రాందాస్‌, గుగులోతు సుగుణమ్మ, తేజ్య, ఆయిల్‌ ఫెడ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ అనిల్‌, బిందు సేద్య అధికారులు అగస్టిన్‌, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం  అందించాలి1
1/2

నాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం  అందించాలి2
2/2

నాణ్యమైన భోజనం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement