విద్యతోనే మహిళా సాధికారత | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే మహిళా సాధికారత

Mar 7 2025 9:39 AM | Updated on Mar 7 2025 9:39 AM

కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అ న్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా ది నోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలో నూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్‌ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బి.రమ, టి.స్వప్న, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement