‘ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తుంటే.. వర్ధన్నపేట కాంగ్రెస్ అడ్డాగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు పోలీసులు, దొంగల మధ్య జరుగుతున్నవి. ఎటువైపు ఉంటారో ప్రజలు ఆలోచించాలి’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ‘2014కు కొనుక్కోవడానికి చెప్పులు లేని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఇప్పుడు వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్‌లో వేలాది ఎకరాలు ఉన్నాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే అయ్యి ల్యాండ్ పూలింగ్ మీద మీ భూములు గుంజుకొని ఎందుకని అడిగితే పోలీసు బూట్లతో తన్నించాడు. ఆ వేళ ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే నేను వచ్చి మీతో కలిసి కూర్చున్నా. మీ తాతాల నుంచి వచ్చిన భూముల్లో సేద్యం చేస్తూ బతుకీడుస్తుంటే ఆ భూములు లాక్కొని రోడ్డున పడేసే ప్రయత్నం చేయలేదా అరూరి.. మీరు పోతే మీ మీదకు బండి ఎక్కించే ప్రయత్నం చేయలేదా. ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు ఓ పోలీసు, దొంగ మధ్య జరుగుతున్నవి’ అని అన్నారు. ‘దయాకర్‌రావు, రమేశ్ అయినా, ఇక్కడి నుంచి వలసవెళ్లిన శ్రీహరి అయినా.. వీరు ఎవరి ముందైనా గొంతు ఎత్తి మాట్లాడగలరా? ఈ బానిసలు మనకు ఎమ్మెల్యేలు కావాల్నా.. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. వర్ధన్నపేట నుంచి కేఆర్ నాగరాజును, వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలను కోరారు. ఆయా సభల్లో ఏఐసీసీ అబ్జర్వర్ అరవింద్ దాల్వి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ శోభ, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట ఇన్‌చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర రావు, దేవేందర్ రావు, మేకల వరలక్ష్మి, లింగాజీ, నరేందర్‌రెడ్డి, చేపూరి చిరంజీవి, అమృతరావు, జగదీశ్‌రెడ్డి, కీసర ది లీప్‌రెడ్డి, కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, శ్రీరాములు ఉన్నారు.