సమాజంలో సౌభ్రాతృత్వం విలసిల్లాలి | - | Sakshi
Sakshi News home page

సమాజంలో సౌభ్రాతృత్వం విలసిల్లాలి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు

కర్నూలు (టౌన్‌): సమాజంలో ప్రేమ, సౌభ్రాతృత్వం విలసిల్లాలని విజయవాడ డయాసిస్‌ బిషప్‌ తెలగతోటి రాజారావు అన్నారు. కర్నూలులోని లూర్డుమాత క్యాథడ్రల్‌ బిషప్‌ చర్చిలో ఆదివారం కర్నూలు డయాసిస్‌ బిషప్‌ గోరంట్ల జ్వాన్వేష్‌తో కలిసి క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం నిర్వహించారు. బిషప్‌ తెలగతోటి రాజారావు దైవసందేశమిస్తూ.. యేసుక్రీస్తు సాధారణ మానవుడిగా శిలువ వేయబడి మృత్యుంజయుడయ్యాడన్నారు. అనంతరం శరీరంతోనే మోక్షారోహణమై పరలోకంలో సింహాసీనుడయ్యారన్నారు. క్రీస్తు ఈ లోకానికి నేర్పిన ప్రేమ, సేవ, త్యాగాలను పాటించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement