ఆకాశం మేఘావృతమైన వేళ పచ్చని చెట్ల నడుమ మయూరాలు పరవశిస్తూ ప్రకృతికి మరింత వన్నె తెస్తున్నాయి. తంగడంచ ఫారం జాతీయపక్షి నెమళ్లకు నివాస కేంద్రంగా మారింది. సారవంతమైన నల్లరేగడి నేలలుండటంతో పాటు సమీపంలో కేసీ కాల్వ ఉంది. దీంతో వందల సంఖ్యలో నెమళ్లు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అరుస్తూ సందడి చేస్తున్నాయి. తంగడంచ సీడ్ ఫారాన్ని జాతీయ పక్షి నెమళ్లకు ఆవాసయోగ్య ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
– జూపాడుబంగ్లా


