కృష్ణగిరి: కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డి. హనుమంతు (57) అనారోగ్యంతో కో లుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలి పారు. ఈయన స్వగ్రామం కృష్ణగిరి మండల పరిధిలోని టి.గోకులపాడు. ఈయన 1995 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి జిల్లాలోని అవుకు, కర్నూలు టూటౌన్, హోళగుంద, మిడుతూ రు,వెల్దుర్తి, ఉల్లిందకొండ, మద్దికెర, ప్రస్తుతం కర్నూ లు త్రీటౌన్‌లో పని చేస్తున్నారు. ఈ నెల 8న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రితో ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని టి. గోకులపాడు గ్రామంలో పోలీస్ లాంచనాలతో అంత్యక్రియలు చేశారు. త్రీటౌన్ సీఐ శేషయ్య, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, సహుద్యోగులు పాల్గొన్నారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


