వంతెన మీద నిలిచిన గొర్రెల మంద
వందల సంఖ్యలో జీవాలు.. కాపరులు ఇద్దరు, ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. వేసవిలో మేత కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జీవాలను తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రహదారులు, వాగులు, వంకలు, కుంటలు మీదుగా తీసుకెళ్లాల్సి వస్తోంది. అయితే మందలో ఒకటి కూడా తప్పిపోకుండా చూసుకోవడం కాపరుల నిఘా ఎంత ఉన్నా.. జీవాలు ఒక దాని వెంట ఒకటి వెళ్తూ క్రమశిక్షణ అవవర్చుకున్నట్లుగా కనిపిస్తాయి. మండు వేసవిలో జీవాలకు దాహం తీర్చుందుకు కాపరులు క్రిష్టిపాడు సమీపంలోని కుందూ నది ఆవతలి వైపు తీసుకెళ్తుండగా వంతెనపై జీవాలు వరుసలో నిలబడి ‘ఎక్కడైనా సరే క్యూలో ఉంటామంటూ’ చెప్పినట్లుగా కనిపించింది ఈ చిత్రం. కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు సైతం వరుసలో నిలబడి ఆకట్టుకున్నాయి. – దొర్నిపాడు


