నవోదయలో నో అడ్మిషన్‌ | - | Sakshi
Sakshi News home page

నవోదయలో నో అడ్మిషన్‌

May 16 2026 12:45 AM | Updated on May 16 2026 12:45 AM

27 మందికి సీట్లు రిజెక్ట్‌

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రెన్స్‌ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 27 మందిని విద్యాలయంలో చేర్చుకోమని విద్యాలయ ప్రిన్సిపాల్‌ పద్మావతి చెప్పారు. దీంతో శుక్రవారం విద్యాలయం సమీపంలో విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన చేశారు. ప్రిన్సిపాల్‌ రిజెక్ట్‌ చేసిన 27 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాలకు చెందిన వారు. నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు ఒక్క సారే చేసుకోవాలని, మొదటి సారి సీటు రాకపోతే రెండోసారి చేసుకోవటానికి లేదని విద్యాలయం వారు చెబుతున్నారు. రెండోసారి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఉత్తీర్ణత సాధించినప్పుడు ఎందుకు చేర్చుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌, నవోదయ సమితి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయలని, లేదంటే విద్యాలయం ముందే దీక్షలు చేపడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement