● పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన దళితులు
పత్తికొండ రూరల్: మండల పరిధిలోని జూటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీఆంజనేయస్వామి ఆలయ ప్రవేశంపై శుక్రవారం గ్రామంలో వివాదం చోటుచేసుకుంది. గత రెండు రోజుల క్రితం గ్రామంలో సమష్టిగా ఆలయ ప్రారంభం, ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆలయంలోకి వెళ్లిన కొందరిని మరో సామాజిక వర్గానికి చెందిన వారు ప్రశ్నించినట్లుగా తెలిసింది. దీంతో ఆలయంలోకి వెళ్లేందుకు తమకు అనుమతి కావాలని దళితులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీఐ జయన్న మాట్లాడుతూ.. ఘటనపై విచారణ చేసి న్యాయం చేస్తామన్నారు.


