కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటు పురోగతిపై జేసీ నూరుల్ ఖమర్‌తో కలసి పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, నెడ్ క్యాప్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 పరిశ్రమలకు ఎంఓయూలు అయ్యాయని, వీటిలో 11 పరిశ్రమలకు శంకుస్థాపనలు పూర్తయ్యాయన్నారు. కోడుమూరు ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టుకు త్వరగా భూసేకరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ, డీఆర్వోలను ఆదేశించారు. మంత్రాలయం సందర్శనకు వచ్చే వీఐపీల కోసం పరిసర ప్రాంతాల్లో హెలిప్యాడ్‌ను సిద్ధం చేయాలన్నారు. దూపాడు–బేతంచెర్ల రైల్వేలైన్ ఏర్పాటు, ఓర్వకల్ వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం అశోక్‌కుమార్, ఏపీఐఐసీ జెడ్‌ఎం మధుసూధన్‌రెడ్డి, నెడ్‌క్యాప్ అధికారి దేవేంద్ర పాల్గొన్నారు.
● వ్యవసాయ, ఉద్యాన శాఖలకు కేటాయించిన లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. డ్రిప్ ఇరిగేషన్‌తో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. గురువారం సాయంత్రం ఆమె తన కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.


