పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

లీలా వెంకటశేషాద్రి

కర్నూలు: సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సెటిల్‌మెంట్‌కు స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా కృషి చేయాలని లీగల్‌ సర్వీసెస్‌ సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు కర్నూలు కోర్టు కాంపౌండ్‌లోని న్యాయసేవా సదన్‌లో లీగల్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ విధులపై సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రితో పాటు శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకటహరినాథ్‌ ముఖ్య అతిథులుగా హాజరై లీగల్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ విధులు, లీగల్‌ ఎయిడ్‌ కేసుల వివరాలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై సూచనలు చేశారు. ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు సుప్రీం కోర్టులో జరిగే స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల సెటిల్‌మెంట్‌ కోసం కృషి చేయాలన్నారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ స్టాఫ్‌ వద్ద పెండింగ్‌ కేసులలో ఎన్నింటినికి బెయిల్స్‌ మంజూరు చేశారో ఆ కేసుల స్థితిగతులను తెలుసుకున్నారు. మిగిలిన వాటిని ఏ విధంగా త్వరితగతిన పరిష్కరించాలనేదానిపై సూచనలు ఇచ్చారు. శాశ్వత లోక్‌అదాలత్‌ స్టాఫ్‌ ప్రజా వినియోగ పది రకాల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరాం, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సులోచన, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement