కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్ వై. కామేశ్వర ప్రసాద్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను కర్నూలుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ పల్మనాలజీ అభ్యసించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు.
1,031 పింఛన్ల కోత
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ చేపట్టడానికి డీఆర్‌డీఏ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 4,47, 648 పింఛన్లకు రూ.196.3 కోట్లు విడుదలయ్యా యి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 1,031 పింఛన్లపై కోత పడింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్‌లో ఏర్పాటైంది. దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త పింఛన్ల ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ హామీని కూడా కొండెక్కించడం గమనార్హం.


