చౌడేశ్వరీ దేవి హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

చౌడేశ్వరీ దేవి హుండీ ఆదాయం లెక్కింపు

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

బనగానపల్లె రూరల్‌: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరీ దేవస్థానంలో హుండీలోని కానుకలను లెక్కించగా రూ.20,35,355 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. గత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించినట్లు చెప్పారు. నగదుతో పాటు 11 గ్రాముల బంగారు ఆభరణాలు, 390 గ్రాముల వెండి అభరణాలు వచ్చినట్లు వెల్లడించారు. గ్రూపు ఆలయాల ఈఓ బ్రహ్మనందరెడ్డి, చైర్మన్‌ పీవీ నాగార్జునరెడ్డి, పాలక మండలి సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement