నేతన్నల అభ్యున్నతికి చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప పట్టణంలో స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ సంస్థను కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి వేర్వేరు గా చేనేతలు, పార్టీ శ్రేణులతో భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు లేకుండా చేసేందుకే కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కుట్రపన్నుతున్నారని బుట్టారేణుక విమర్శించారు. మార్కెటింగ్ పేరుతో ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చేనేతలపై ప్రేమ వుంటే సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. చేనేతలకు ఆధారమైన వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనం చేస్తే వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుందన్నారు.


