డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నవంబర్‌/డిసెంబర్‌ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 3, 5వ సెస్టర్‌ల రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. 3వ సెమిస్టర్‌కు 2999 మందిలో 713 మంది, 5వ సెమిస్టర్‌లో 1936 మందిలో 561 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలు http:// rayala seema university.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

నేటి నుంచి గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్‌ కే.పుష్పక్‌ తెలిపారు. లేడీస్‌ టైలరింగ్‌, మగ్గం వర్క్‌, ఎంబ్రాయిడరీ డిజైన్‌లో 19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి శిక్షణ మొదలవుతుందన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. పూర్తి వివరా లకు 08518–273710, 90007 10508, 63044 91236, 96662 24931, 94409 0547 7 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

హాస్టల్‌ విద్యార్థులకు

పౌష్టికాహారాన్ని అందించండి

కర్నూలు(అర్బన్‌): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని ఎస్‌సీ, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లోని విద్యార్థినీలతో భోజనం, వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన స్వయంగా విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని స్టాక్‌ రిజిస్లర్లను పరిశీలించారు. పిల్లలకు చట్టపరమైన సమస్యలు ఉంటే లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100కు కాల్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారిణులు శైలజ, రజని పాల్గొన్నారు.

ముగ్గురు డిబార్‌

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో మంగళవారం 94 శాతం హాజరు నమోదైంది. 5,311 మందిలో 4990 మంది హాజరు కాగా 318 మంది గైర్హాజరయ్యారని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా వారిని డిబార్‌ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement