జెడ్పీ సీఈఓగా జీవీ రమణారెడ్డి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈఓగా జీవీ రమణారెడ్డి

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

● అనంతపురం డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా జి.నాసరరెడ్డి ● డ్వామా పీడీగా ఐ.నరసింహారెడ్డి

● అనంతపురం డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా జి.నాసరరెడ్డి ● డ్వామా పీడీగా ఐ.నరసింహారెడ్డి

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జీవీ రమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ శశి భూషణ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహిస్తూ, 2024 నవంబర్‌ 25న ఇక్కడకు డీడీఓగా బదిలీపై వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓలుగా ఉన్న వారందరికీ సీనియారిటీ ప్రకారం ఇటీవలే ప్రభుత్వం సీఈఓ హోదాలో పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో రమణారెడ్డిని ఇక్కడకు సీఈఓగా నియమించారు.

● నెల్లూరు జిల్లా బోగోలు నుంచి 2022 ఆగస్టు 13న ఇక్కడకు జెడ్పీసీఈఓగా పదోన్నతిపై వచ్చి ఇప్పటి వ రకు విధులు నిర్వహిస్తున్నజి.నాసరరెడ్డిని ప్రభు త్వ ం అనంతపురం డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమించింది.

● నంద్యాల జిల్లా డోన్‌ డీఎల్‌డీఓగా విధులు నిర్వహిస్తున్న ఐ.నరసింహారెడ్డిని కర్నూలు డ్వామా పీడీగా నియమించారు.

● నంద్యాల జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధు లు నిర్వహిస్తున్న కె.లలితాబాయిని నంద్యాల డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా, నంద్యాల డ్వామా లో ఎంఅండ్‌ఈగా విధులు నిర్వహిస్తున్న టీవీ భాస్కర్‌నాయుడును ప్రకాశం డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమించారు.

జీవీ రమణారెడ్డి ,జీ నాసరరెడ్డి,ఐ నరసింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement