ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం
పెరిగే అవకాశం
ఒక్కో అసెంబ్లీలో 1.60 లక్షల ఓటర్లు ఉండేలా విభజన
పునర్విభజనలో మహిళలకు 33 శాతం సీట్లు
ఎస్సీ, ఎస్టీలకు కూడా పెరగనున్న సీట్లు
సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకూ నిషేధం ఉంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లు–2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్లమెంట్ వెసులుబాటు కల్పించింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనపై ఆ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని బిల్లులో పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిషేధం పూర్తవడం, కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవడంతో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం, ఆపై పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేయడమే తరువాయి. 2029 సార్వత్రిక ఎన్నికలు కొత్తగా పెరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతోనే జరగనున్నాయి.
ఉమ్మడి కర్నూలులో పెరగనున్న
6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం
ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీల చొప్పున ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంతా భావించారు. అయితే 50శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 88 అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్లమెంట్‌కు 3 చొప్పున మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఈ లెక్కన 20 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టంతో ప్రస్తుతం ఉన్న 2 ఎస్సీ స్థానాలు 3కు పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్‌తో మొత్తం నియోజకవర్గాల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 20 స్థానాల్లో దాదాపు 7 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 2027 మార్చికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో కొత్త జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగనుంది. 1.60లక్షల ఓట్లతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కానుంది.
1 లేదా 2 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం
పార్లమెంట్ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానం కచ్చితంగా పెరుగుతుంది. అయితే రాష్ట్రంలోని పెద్ద జిల్లాలో కర్నూలు ఒకటి. ఆ మేరకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక ఎంపీ స్థానం చొప్పున రెండు జిల్లాల్లో పెరగనున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో కలిపి మరో ఎంపీ స్థానం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదోని కేంద్రంగా పార్లమెంట్ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉండొచ్చు.
నియోజకవర్గం ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న మిగిలే
ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య
కర్నూలు 2,70,942 1,60,000 1,10,942
పాణ్యం 3,22,494 1,60,000 1,62,494
పత్తికొండ 2,19,639 1,60,000 59,639
కోడుమూరు 2,41,767 1,60,000 81,767
ఎమ్మిగనూరు 2,43,067 1,60,000 83,067
మంత్రాలయం 2,05,429 1,60,000 45,429
ఆదోని 2,57,529 1,60,000 97,529
ఆలూరు 2,53,927 1,60,000 93,927
మొత్తం 20,14,794 12,80,000 7,34,300
ఆళ్లగడ్డ 2,32,676 1,60,000 72,676
శ్రీశైలం 1,96,116 1,60,000 36,116
నందికొట్కూరు 2,18,047 1,60,000 58,047
నంద్యాల 2,73,938 1,60,000 1,13,938
బనగానపల్లి 2,41,179 1,60,000 81,179
డోన్ 2,27,351 1,60,000 67,351
మొత్తం 17,21,013 9,60,000 4,29,307
కొత్తగా పెరిగే నియోజకవర్గ కేంద్రాలపై సర్వత్రా చర్చ
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓటర్ల వివరాలు
నియోజకవర్గాల
పునర్విభజనకు
కేంద్రం కసరత్తు
పునర్విభజనతో కొత్తగా పెరిగే నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కర్నూలు అర్బన్, రూరల్ రెండు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో అత్యంత పెద్ద నియోజకవర్గం పాణ్యం. 3.22 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇది రెండుగా విడిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఆలూరు నుంచి 93,927 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆలూరు నుంచి దేవనకొండ విడిపోయి కొత్త నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
వెల్దుర్తి కేంద్రంగా ఓ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
అలాగే నంద్యాలలో కూడా 1,13,938 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా నంద్యాల అర్బన్, రూరల్ అయ్యే అవకాశం ఉంది.
బనగానపల్లిలో 81,179 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా కోవెలకుంట్ల కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ నుంచి ఓ మండలం కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
దీంతో రాజకీయంగా ఎమ్మెల్యేలు కావాలని ఆశపడేవారు మరింత ఉత్సాహంతో పనిచేస్తే రాజకీయ పార్టీలు వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది.


