నేడు విద్యుత్‌ టారిఫ్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ టారిఫ్‌ విడుదల

Mar 25 2026 7:03 AM | Updated on Mar 25 2026 7:03 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం పెరిగే అవకాశం

ఒక్కో అసెంబ్లీలో 1.60లక్షల ఓటర్లు ఉండేలా విభజన

పునర్విభజనలో మహిళలకు 33 శాతం సీట్లు

ఎస్సీ, ఎస్టీలకు కూడా పెరగనున్న సీట్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2026–27 సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ రిటైల్‌ సప్లయ్‌ టారిఫ్‌ను కర్నూలులోని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(ఏపీఈఆర్‌సీ) ఈ నెల 25న విడుదల చేయనుంది. ఇప్పటికే డిస్కమ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టారిఫ్‌లపై ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. అయితే దీనిపై ఏపీఈఆర్‌సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వినియోగదారుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో వైపు 2024–25 సంవత్సరానికి సంబంధించి ట్రూ అప్‌/డౌన్‌పై కూడా ఏపీఈఆర్‌సీ నిర్ణయాన్ని బుధవారం వెలువరించనుంది. డిస్కమ్‌లు నిర్వహణ వ్యయం పెరిగిందనే కారణంతో ట్రూ అప్‌ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే, ఎంపీలు కావాలని ఆశపడుతున్న రాజకీయ ఆశావహులకు శుభవార్త. దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజుల నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ (పునర్విభజన) చట్టాల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు

నియోజకవర్గాల

పునర్విభజనకు

కేంద్రం కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement