నిధులు నిలిపివేయడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

నిధులు నిలిపివేయడం అన్యాయం

Mar 23 2026 8:50 AM | Updated on Mar 23 2026 8:50 AM

నిధులు నిలిపివేయడం అన్యాయం రాజకీయ కక్ష తగదు ప్రారంభించకపోతే ఉద్యమిస్తాం

గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం క్లబ్‌హౌస్‌లో ఫర్ని చర్‌, జిమ్‌, స్నూకర్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌ పరికరాల కొనుగోలుకు రూ.18 లక్షలను మంజూరు చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపును అన్యాయంగా నిలిపేసింది. దీంతో క్రీడాకారులకు, చిన్నారులకు క్లబ్‌హౌస్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అక్కరకు రాని చుట్టంగా మిగిలిపోయింది.

– పోసు్ట్రపసాద్‌, వైఎస్సార్‌సీపీ వలంటీర్‌ విభాగం జిల్లా అధ్యక్షులు

అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వం స్పోర్ట్స్‌ క్లబ్‌, క్లబ్‌హౌస్‌ను కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వీటిని ప్రారంభించకపోవడం ముమ్మాటికీ రాజకీయ కక్షగానే ప్రజలు చూస్తు న్నారు. ప్రజోపకరమైన అభివృద్ధి పనులను వినియోగంలోకి తెస్తే బాగుంటుంది.

– జాకీర్‌హుసేన్‌,

మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, డోన్‌

డోన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ.4 వేల కోట్లను ఖర్చు చేశారు. పూర్తయిన వాటిని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించలేదంటే ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షగా భావిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన విధానాలను మానుకొని సత్వరమే ప్రజలకు ఈ భవనాలను అందుబాటులోకి తేవాలి. లేదంటే క్రీడాకారులతో పాటు పట్టణ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం.

– రంగనాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి, డోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement