ఉగాది, రంజాన్ పండగలు ముగియటంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పండగ రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఆదివారం బస్టాండ్‌లో కర్నూలు, ఆదోని ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులకు బస్సులు లేక గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఒక వైపు ఎండ వేడిమి లెక్క చేయకుండా బస్సుల కోసం రోడ్డుపైకి వచ్చి వేచి ఉండాల్సి వచ్చింది. బస్సు వచ్చినా సీటు కోసం మహిళలు, పురుషులు, పరుగులు పెడుతూ కనిపించారు. పలువురు అధికారులపై మండిపడ్డారు. ఊర్లకు ఎలా అంటూ వాపోయారు. – ఎమ్మిగనూరురూరల్
కర్నూలు బస్సు ఎక్కేందుకు తోసుకుంటున్న ప్రయాణికులు
సీటు కోసం ప్రయాణికుల పాట్లు


