బాలభీముడు
కోడుమూరు రూరల్: కోడుమూరులోని ప్రభుత్వాసుపత్రిలో 4 కిలోల బరువున్న శిశువు జన్మించాడు. ఔరా బాలభీముడు అని చూసిన వారు ఆశ్చర్యపోయారు. సి.బెళగల్ మండలం కంబదహాల్ గ్రామానికి చెందిన హేమవతి ప్రసవ నొప్పులతో బుధవారం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యాధికారి డా.నాగరాజు, గైనకాలజిస్ట్ ప్రగతి ఆ మహిళకు సాధారణ కాన్పు చేశారు. సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల వరకు బరువు ఉంటారని, హేమవతికి జన్మించిన బిడ్డ ఏకంగా 4 కిలోల బరువు ఉండడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యాధికారి డా.నాగరాజు విలేకరులకు తెలిపారు.
బడిలో భవిష్యత్తుకు బాటలు
దొర్నిపాడు: ఎంతో మంది భవిష్యత్తుకు బడిలో బాటలు పడతాయని జిల్లా విద్యాధికారి జనార్ధన్‌రెడ్డి అన్నారు. దాతల రూ.2లక్షల విరాళంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన స్టేజి, బండపరును బుధవారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ.. పాఠశాలను చూస్తుంటే తన చిన్ననాటి జ్ఙాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. అనంతరం క్రిష్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు. ఎంఈఓలు మనోహర్‌రెడ్డి, రామచంద్రయ్య, హెచ్‌ఎంలు చెన్నకేశ్వరి, శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షల్లో 9 మంది డీబార్
కర్నూలు (సెంట్రల్) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 9 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. బుధవారం జరిగిన సెమిస్టర్‌కు 10,649 మంది విద్యార్థులకు 9,811 మంది హాజరుకాగా 829 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 92 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాలలో ఒకరు, నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇద్దరు, ఆదోని జ్యోతిర్మయి కాలేజీలో ముగ్గురు, ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ, డోన్ జీవీఆర్‌ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, కర్నూలు నందనవనం డిగ్రీ కాలేజీలలో ఒక్కొక్కరు చొప్పున డీబార్ అయ్యారు. మరోవైపు వర్సిటీ పరిధిలోని బీటెక్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు, లా పరీక్షలకు 92 శాతం, యోగా పరీక్షలకు 100 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్షల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
యువకుడి బలవన్మరణం
ఆదోని అర్బన్: పట్టణానికి చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.బుధవారం త్రీటౌన్ ఎస్‌ఐ రామస్వామి తెలిపి న వివరాల మేరకు..అరు ంజ్యోతి కాలనీకి చెందిన నరసప్ప, శకుంతల దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమారుడైన మహేష్ బేల్దారి పని చేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఇంట్లో మాటా మాటా పెరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేష్ మంగళవారం రాత్రి ఇంటి మిద్దైపెకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బాలభీముడు
బాలభీముడు


