భక్తిశ్రద్ధలతో కాటసాని శివదీక్ష విరమణ
బనగానపల్లె: పవిత్ర శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భక్తిశ్రద్ధలతో శివదీక్ష విరమించారు. ఉదయం పాతపాడు గ్రామ ముఖ ద్వారం నుంచి కాటసాని ఇరుముడులు ధరించి కాలినడకను యాగంటి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయంలోని ఉమామహేశ్వరస్వామి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి శివదీక్ష విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు రాష్ట్ర వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి ఆయన సతీమణి కాటసాని రూపశ్రీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దీక్ష విరమణ కార్యక్రమంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పచక్రపాణిరెడ్డి, నియోజకవర్గ సీనియర్ వైఎస్సార్‌సీపీ నాయకులు కాటసాని ప్రసాదరెడ్డి, పార్టీ అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్‌రెడ్డి, కాటసాని గణేష్‌రెడ్డి, పెద్దమునిరెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, గడ్డం వెంకటేశ్వరరెడ్డి, బండి బ్రహ్మనందరెడ్డి, రామచంద్రారెడ్డి, సురేష్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


