అహోబిలేశుడికి పట్టువస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

అహోబిలేశుడికి పట్టువస్త్రాల సమర్పణ

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

అహోబి

అహోబిలేశుడికి పట్టువస్త్రాల సమర్పణ

రుద్రవరం: పార్వేట ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలానరసింహస్వామి, శ్రీప్రహ్లద వరదస్వామికి బుధవారం తెలంగాణ ప్రభుత్వం పట్టు పీతాంబర వస్త్రాలను సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి పల్లకీ మండల కేంద్రమైన రుద్రవరం చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు మహబుబ్‌ నగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మదన్‌, గద్వాల్‌ జోగులాంబ ఆలయ కార్యనిర్వాహణ అధికారి దీప్తిరెడ్డి, వేద పండితులను పంపించారు.వారు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ మూర్తుల చెంతకు చేరుకొని అహోబిల దేవస్థానం సీఏఓ రామనుజన్‌, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్‌, అర్చకులు కళ్యాణ రంగన్‌కు పట్టు వస్త్రాలు అందజేశారు. వారు స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు ముగియగానే అర్చకులు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు నరసింహస్వామి జ్ఞాపిక అందజేసి పూలమాలలతో సత్కరించారు.

అహోబిలేశుడికి పట్టువస్త్రాల సమర్పణ 1
1/1

అహోబిలేశుడికి పట్టువస్త్రాల సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement