భక్తిభావంతో జీవించాలి | - | Sakshi
Sakshi News home page

భక్తిభావంతో జీవించాలి

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

భక్తిభావంతో జీవించాలి

భక్తిభావంతో జీవించాలి

బిషప్‌ సంతోష్‌ ప్రసన్నరావు

నంద్యాల(న్యూటౌన్‌): ఉపవాస దినాల్లో క్రైస్తవులు ఆత్మ నియంత్రణతో పాటు భక్తి భావంతో జీవించాలని నంద్యాల డయాసిస్‌ అధ్యక్షుడు బిషప్‌ ది రైట్‌ రెవరెండ్‌ కె.సంతోష్‌ ప్రసన్నరావు అన్నారు. పట్టణంలోని హోలీక్రాస్‌ కెథడ్రల్‌ పాస్టరేట్‌–1 ఆలయంలో భస్మ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నంద్యాల పీఠాధిపతులు బిషప్‌ ప్రసన్నరావు హాజరై దైవ సందేశం అందించారు. ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్లినప్పుడే మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఏడాదిలో 365 దినాల్లో 40 దినాలు ప్రాముఖ్య దినాలన్నారు. ఉపవాస ప్రార్థనలను అపహాసం చేయరాదన్నారు. అనంతరం క్రైస్తవులందరికీ నుదుటన భస్మంతో శిలువ గుర్తును వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదే విధంగా పాస్టరేట్‌–2 ఆలయంలో డీనరీ చైర్మన్‌ ఎంఐడీ ప్రసాద్‌, డేవిడ్‌ వేణు, పాస్టరేట్‌–3 మత్తయి ఆలయంలో డీనరీ చైర్మన్‌ రెవరెండ్‌ సామేలు రత్నరాజు గురువులతో పాటు పాస్టరేట్‌–6 ఆలయంలో పాస్టరేట్‌ చైర్మన్‌ విక్టర్‌ బాబు ఆధ్వర్యంలో బస్మ బుధవారం ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టరేట్ల సెక్రటరీ, కమిటీ మెంబర్లు, పాల్గొన్నారు.

హృదయ పరివర్తన అవసరం

పాపాన్ని విడనాడి హృదయ పరివర్తన చెంది జీవించాలని బిషప్‌ గోరంట్ల జాన్వెస్‌ అన్నారు. పట్టణంలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో విభూది బుధవారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్‌ జోసెఫ్‌, కన్యశ్రీలు, విశ్వాసులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement