సూర్యాపేట వృషభాల విజయం
మహానంది: మహాశివరాత్రి సందర్భంగా మహానందిలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో సూర్యాపేట వృషభాలు సత్తా చాటాయి. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పోటీలను సోమవారం ప్రారంభించారు. సీనియర్స్ విభాగంలో జరిగిన పోటీల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన ఎస్‌ఎస్‌ఆర్ బుల్స్ సుంకి సురేందర్‌రెడ్డి వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కాసన్నేని రాజా చౌదరి, వల్లభనేని మోహన్‌రావుల వృషభాలు ద్వితీయస్థానం, నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి కేశవరెడ్డి, మేకా కృష్ణమోహన్‌ల వృషభాలు సంయుక్తంగా తృతీయస్థానం, కృష్ణా జిల్లా ముల్లవల్లికి చెందిన అక్కినేని ముకుల్ సత్య చౌదరి వృషభాలు నాలుగు, బాపట్ల జిల్లాకు చెందిన ఆర్‌కే బుల్స్ ఐదో స్థానంలో నిలిచాయి. గెలుపొందిన వృషభాల యజమానులకు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ.లక్ష, రూ.80 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు నగదు బహుమతులు అందించారు.


