సరస్వతీ నమోస్తుతే!
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు కనులపండువగా నిర్వహించారు. సరస్వతి దేవి పుట్టినరోజును పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సారి శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొదటి వేడుకలు కావడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ చిన్నారులకు అమ్మవారి చెంతన అక్షరాభ్యాసాలు చేయించారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని ‘సరస్వతీ దేవి నమోస్తుతే’’ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఉదయం 4 గంటలకు కవాటోద్ఘాటనం, మంగళవాయిద్యాల నడుమ చారుఘోషిణి నదీ పవిత్రజలంతో ఆలయ ప్రవేశం, గణపతి పూజ, అమ్మవారికి విశేష అభిషేకం, షోడశోపచారపూజ అదేవిధంగా పూలమాలలతో విశేష అలంకరణ వేదపండితులు నిర్వహించారు. అనంతరం 5.20 గంటలకు అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏఈఓ ఫణిందర ప్రసాద్, ఆలయ చైర్మన్ రామేష్ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఆర్డీఓ నాగజ్యోతి, సర్పంచు చంద్రశేఖర్ యాదవ్, కొలనుభారతి దేవి ఆలయ చైర్మన్ వెంకటనాయడు వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయానుసారంగా అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ, కుంకుమార్చన, పుష్పార్యన, బాలభోగనివేదన, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, తహసీల్దార్లు ఉమారాణి, చంద్రశేఖర్ నాయక్, గోపాలకృష్ణ, కొత్తపల్లి జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కె.సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కుసుమలత, పార్టీ నేతలు జనార్దన్ రెడ్డి, నారాయణరెడ్డి, నందికుంట సర్పంచు నిత్యలక్ష్మీదేవి, ఎంపీటీసీ బాలరాజు, మునిరంగ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం, శ్రీశైలం దేవస్థానం వారు, శ్రీ వాసవి మాత ఆర్య, వైశ్యఅన్నదాన సత్రాలవారు భోజన వసతి కల్పించారు.
వేడుకగా సామూహిక అక్షరాభ్యాసం
కొలనుభారతి దేవి ఆలయ సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయ ని, మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల విశ్వా సం. ఇందులో భాగంగా శుక్రవారం వసంత పంచ మి వేడుకలో 810 మంది చిన్నారులకు శ్రీశైలం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అక్షరాభ్యాసం చేయించారు.
కనుల పండువగా
వసంత పంచమి వేడుకలు
వేడుకగా సామూహిక అక్షరాభ్యాస
కార్యక్రమం
వేల సంఖ్యలో అమ్మవారిని
దర్శించుకున్న భక్తులు
సరస్వతీ నమోస్తుతే!


