అతివేగానికి రెండు ప్రాణాలు బలి
● కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా
● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
పెద్దకడబూరు: అతి వేగానికి రెండు ప్రాణాలు బలి అయ్యాయి. ఆదోని – ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలో హనుమాపురం గ్రామ బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఏఎస్‌ఐ శివరాములు వివరాల మేరకు.. ఆదోని పట్టణానికి చెందిన గౌస్‌మోద్దీన్, గాలిబ్ మున్షి, మహమ్మద్ ఇలియాజ్, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాబీర్‌బాషాలు పీడీఎస్ రైస్ (రేషన్ బియ్యం) సరఫరా కోసం కారులో ఆదోని నుంచి ఎమ్మిగనూరు మండలం ముగతి గ్రామానికి వెళ్తున్నారు. అయితే షేక్ షాబీర్‌బాషా కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతున్న సమయంలో హనుమాపురం గ్రామ బస్టాండ దగ్గర అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయాడు. కారు అతి వేగంతో ఉండగా అదుపు తప్పి ఎడమ వైపు ఉన్న పొలంలోకి దూసుకుపోయింది. అక్కడ ఉన్న చెట్టును ఢీకొని కారు బోల్తాపడింది. పక్కనే రోడ్డుపై వెళ్తున్నవారు కారులో ఉన్నవారిని బయటకు తీశారు. అప్పటికే గాలిబ్‌మున్షి(61) అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురిని అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేక్ షాబీర్‌బాషా(25) చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగిలిన గౌస్‌మోద్దీన్, మహమ్మద్ ఇలియాజ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ప్రైవేటు ఆస్పతికి తరలించారు. గౌస్‌మోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
మద్దికెర: స్థానిక బస్టాండు షెల్టర్‌లో గుర్తు తెలియని వృద్ధురాలు శుక్రవారం మృతి చెందినట్లు మద్దికెర ఎస్‌ఐ హరిత తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 80 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా గ్రామంలో యాచిస్తూ కడుపునింపుకునేందన్నారు. వృద్ధురాలికి తెలుగు బాష రాదని, కన్నడ మాత్రమే వస్తుందన్నారు. ఎవరైనా అడిగితే తనది హోస్పేట్ అని చెబుతుండేదన్నారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు మద్దికెర ఎస్‌ఐ 9121101130కు ఫోన్ చేయాలన్నారు.
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
అతివేగానికి రెండు ప్రాణాలు బలి


