మామిడి పంట రక్షణపై అవగాహన అవసరం
● తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం
సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు లు అవగాహన పెంచుకోవాలని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సంస్థ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఉద్యానభవన్‌తో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న దృష్టా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మామిడి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కవర్లు తొడగడంతో నాణ్యత పెంపొందుతుందని తెలిపారు. కవర్లు తొడగకపోతే చీడపీడల ప్రభావం వల్ల కాయల్లో నాణ్యత దెబ్బతింటుందని, కాయల్లో నాణ్యతను పెంచుకునేందుకు ఫ్రూట్స్ కవర్లు వినియోగించాలని సూచించారు. నీరు, ఎరువుల యాజమాన్యంపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ... తేనేమంచు పురుగు, గొంగలి, కాండం తొలుచు, తామర పురుగులు, పండు ఈగ తదితర వాటివల్ల మామిడికి నష్టం కలుగుతుందని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రారంభంలో చీడపీడలను గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. కాగా పలువురు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పూత పిందె రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అనుమానాలపై రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు నరేష్‌కుమార్‌రెడ్డి, మదన్‌మోహన్ గౌడు తదితరులు పాల్గొన్నారు.
కూలీల ఆటో బోల్తా
● వృద్ధురాలి మృతి
పాణ్యం: వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. వారిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలకు.. పాణ్యంకు గ్రామానికి చెందిన 12 కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బలపనూరు సమీపంలో పొలూరు పొలాల్లోకి వెళ్లారు. పనులు ముగించుకుని తిగిరి వసున్న సమయంలో జీఎం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కావడంతో సమీపంలో శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన పాణ్యంకు చెందిన గుడిపాటి పెద్దక్క(61) కోలుకోలేక మృతి చెందింది. రాములమ్మ, రాజేశ్వరి, జ్యోతి, మధారా, షష్మీ, దస్తగిరమ్మతో పాటు మరొకరు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన ఆటోను స్టేషన్‌కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
మామిడి పంట రక్షణపై అవగాహన అవసరం


