అప్పుల పాలయ్యాం
కర్నూలు, ఓర్వకల్లు, హుస్సేనాపురం, డోన్, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఏడాదికి దాదాపు రూ.25 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. లక్ష రూపాయలు కూడా చేతికి రావడం గగనమైంది. చేసిన అప్పులకు వడ్డీలు కొండలు పెరిగనట్లు పెరుగుతూ పోతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలంటే దివాలా తీశాం. అయితే ఈ విషయం బయటకు చెప్పితే అప్పుదారులు మీద పడతారని తేలు కుట్టిన దొంగల్లాగా వ్యాపారంపై ఆశతో ఉన్నాం.
– రామిరెడ్డి, కర్నూలు
రెండున్నరేళ్ల క్రితం నూతన జిల్లా ఏర్పాటు సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆశాజనకంగా ఉంది. స్థలాలు, పొలాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కరోనా అనంతరం కూడా భూములకు ధరలు పలికాయి. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు, జిల్లా కేంద్రాలు ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు మూడు రాజధానులు అంటూ చేసిన ప్రచారాలతో రియల్ ఎస్టేట్ రంగం వెలిగి పోయింది. తాము పట్టుకున్నదంతా బంగారంలా కనిపించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదే ఊపు ఉంటుందని భావించి మోసపోయాం. రూ. కోట్లు ఖర్చు పెట్టి కొన్న భూములు అమ్ముకోలేక భారీగా నష్టపోతున్నాం.
– షేక్ షరీఫ్, రియల్టర్, విశ్వనగర్, నంద్యాల
నిర్మాణ రంగం నిలిచి పోయింది. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పనులు దొరు కుతున్నాయి. ఇల్లు, భవన నిర్మాణాల పను ల వేగం తగ్గింది. రియ ల్ ఎస్టేట్ రంగం పుంజుకునేంత వరకు కార్మికులకు పనులు దొరికేలా లేవు. ఇల్లు గడవటం ఇబ్బందింగా మారింది. రెండేళ్ల క్రితం వరకు వారం రోజుల పాటు పనులు దొరికేవి. ఏడాది కాలంగా మూడు రోజుల పనితో సరి పెట్టుకోవాల్సి వస్తుంది. భవన నిర్మాణ కూలీలను ఆదుకోవాలి.
– తిమ్మయ్య, భవన నిర్మాణ కార్మికుడు, నంద్యాల
అప్పుల పాలయ్యాం


