15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాల్సిందే
104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం తగ్గించిన వేత నాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి. వారికి గతంలో ఇచ్చిన విధంగానే సంవత్సరానికి 15 క్యా జువల్ లీవ్‌లు ఇవ్వాలి. పూర్తిస్థాయిలో 104 వాహనాల్లో బఫర్ ఉద్యోగులను తీసుకోవాలి. భవ్య సంస్థ ఏడు నెలలైనా ఇప్పటి వరకు పే స్లిప్ లు,నియామక పత్రాలు, ఐడీ కార్డులు పూర్తిస్థాయి లో ఇవ్వలేదు. వెంటనే వాటిని ఉద్యోగులకు ఇవ్వాలి. – వెంకటేశ్వర్లు,
జిల్లా అధ్యక్షుడు, 104 ఉద్యోగుల సంఘం
గ్రామీణ ప్రాంతాల్లో అపర సంజీవనిగా పేరు తెచ్చుకున్న 104 వాహనాల ద్వారా ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, ఫిట్స్, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులపై వేదింపులు మానుకో వాలి. మిగులు ఉద్యోగులను నియమించడంతో పాటు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి. – పెద్దయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి,
104 ఉద్యోగుల సంఘం
15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాల్సిందే
15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాల్సిందే


