జిల్లా అంతటా వాహన తనిఖీలు
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, బైకులు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు.


