శ్రీశైల క్షేత్రానికి ఒకే రోజు రూ.1.4 కోట్ల ఆదాయం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శుక్రవారం ఒక్క రోజురూ.1,46,94,825 ఆదాయం వచ్చిందని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో స్పర్శదర్శనం, రూ. 300 అతిశీఘ్రదర్శనం, రూ. 150 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 14 ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా దర్శనం, ఆర్జితసేవలు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా శుక్రవారం దేవస్థానానికి రూ. 73,19,314, ఆఫ్‌లైన్ ద్వారా రూ.73,75,511 ఆదాయం వచ్చిందన్నారు.
రూ.1.50లక్షలు పలికిన పొట్టేలు!
కోసిగి: పందెం పొట్టేలు రూ.1.50 లక్షలు పలికింది. మండల కేంద్రం కోసిగిలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని గవిగట్టు నారాయణ, కృష్ణ ఈ ఏడాది దేవర ఉత్సవాల కోసం మార్చిలో రూ.40వేలకు ఓ పొట్టేలు కొని పెంచుకున్నారు. రోజూ లీటరు పాలు, 4 కోడిగుడ్లు, కేజీ ఉలువలను ఆహారంగా అందించారు. ఉత్సవాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో విక్రయించాలని నిర్ణయించుకోగా, మద్దికేర మండలం ఆగ్రహానికి చెందిన ఈరన్న అనే రైతు రూ.1.50లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని బరువు 120 కేజీలు.
మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్య మాసంను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.
మద్దిలేటి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు
శ్రీశైల క్షేత్రానికి ఒకే రోజు రూ.1.4 కోట్ల ఆదాయం


