ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
● హిందూ సమ్మేళనంలో వక్తలు
హొళగుంద: ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని స్వాములు, ధార్మిక ఉపన్యాసకులు, వక్తలు పిలుపునిచ్చారు. హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్యోతి వెలిగించి శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి (శ్రీధరగడ్డ) హాజరయ్యారు. సమ్మేళనంలో తుముకూరుకు చెందిన ఎం, బాలచంద్ర, బెంగళూరుకు చెందిన హారిక మంజునాథ్, సురేంద్ర మాట్లాడారు. అన్ని మతాలు, ప్రాంతాలు బాగుండాలని కోరే ఏకై క దేశం భారతదేశమన్నారు. ఇందుకు ఇక్కడి ప్రజలు నమ్ముకున్న సనాతన ధర్మమే కారణమన్నారు. చత్రపతి శివాజీ, ఆయన తనయుడు చత్రపతి సంభాజీలాంటి మహనీయులతో నేడు సనాతన ధర్మం మనుగడలో ఉందన్నారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం


