ప్రయాణికుల కస్సు‘బస్సు’
● కర్నూలు నంచి గూడూరు–
ఎమ్మిగనూరు రూట్‌లో బస్సుల కొరత
● ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా
పట్టించుకోని అధికారులు
కర్నూలు (సిటీ): కర్నూలు నుంచి గూడూరు మీదుగా ఎమ్మిగనూరు వెళ్లే రూట్‌లో ఆర్టీసీ బస్సుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఉచిత బస్సు అమలు చేసిన తర్వాత కొరత మరింత తీవ్రమయ్యింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం రాత్రి 7 నుంచి 9:15 గంటల వరకు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రూట్‌లో బస్సు సర్వీసులు లేవని ఆర్టీసీ ఆర్‌ఎం దృష్టికి గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రయాణికులు ఆందోళన చేసినా అధికారుల్లో చలనం లేదు. ఈ విషయమై ఫిర్యాదుల విభాగంలో, డిపోలోకి వెళ్లి ప్రయాణికులు అడిగితే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధులు సైతం ఈ రూట్‌లో బస్సుల కొరతను తీరుస్తామని చెబుతున్నప్పటికీ ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు. శనివారం రాత్రి 9:18 గంటలకు బస్సు రావడంతో ప్రయాణికులు ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించి దొంగలు ఇద్దరు ప్రయాణికుల సెల్‌ఫోన్లను కాజేశారు. దీంతో బస్‌స్టేషన్ ఔట్‌పోస్టు పోలీసులు 20 నిమిషాలు బస్సు నిలిపివేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయినా సెల్‌ఫోన్లు దొరకకపోవడంతో బస్సును ముందుకు కదిలించారు.
ప్రయాణికుల కస్సు‘బస్సు’


