వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న లాస్ట్‌గ్రేడ్ సర్వీస్ రెండు పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రెండో విడత సెలెక్షన్ జాబితాను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేది సాయంత్రం 5 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలన్నారు. వివరాలకు వెబ్‌సైట్‌లు https://kurnool.ap.gov.in,
https://nandyal.ap.gov.in లను చూడాలన్నారు.
వేగంగా పాత గేట్ల తొలగింపు పనులు
హొళగుంద: తుంగభద్ర జలాశయంలో 33 పాత గేట్ల తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవగానే నెలలో ఆరు గేట్ల ప్రకారంగా కుడి, ఎడమ, మద్య భాగాలలో మొత్తం మూడు బృందాలు 2026 మే నెల కల్లా 33 గేట్ల బిగింపు పనులు పూర్తి చేస్తారు. పనులకు వీలుగా డ్యాంలో నీటిని నదికి వదిలి నిల్వ సామర్థ్యాన్ని 40 టీఎంసీల వరకు తగ్గించారు. డ్యాంకు శనివారం ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. జనవరి 10 లేదంటే మరి కొద్ది రోజులు మాత్రమే కాలువలకు నీటిని వదలనున్నారు. అనంతరం నీటి సరఫరా బంద్ చేయనున్నారు. ప్రస్తుతం దిగువ కాలువ 250 కి.మీ వద్ద 647 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.


