26 నుంచి ప్రత్యేక క్యాంపులు
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నాం. వాటిలో రైతులు అర్జీలు ఇస్తే చుక్కల భూములు, నిషేధిత జాబితా భూములు, అడంగల్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కార్యాలయంలో అధికారులు అ ందుబాటులో ఉండి పరిష్కారాలు చూపుతారు. – డాక్టర్ ఏ.సిరి, జిల్లా కలెక్టర్
నాకు చిప్పగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 558/1 1.17 సెంట్లు, మరో సర్వే నంబర్540/3లో 0.70 సెంట్లు మొత్తం 1.87 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి నాకు ఆదరువు. అయితే దానిని ఆన్‌లైన్ చేయమని పదిసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశా. ఎవరూ పట్టించుకోవడంలేదు. అర్జీ ఇస్తే వీఆర్వోలు మాట్లాడి పరిష్కారమైనట్లు చెబుతున్నారు. నేను మాత్రం ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వస్తూనే ఉన్నాను. నా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. – కేఎన్ రామచంద్ర, ఎస్సీకాలనీ, చిప్పగిరి
సమాచారం ఇవ్వడం లేదు
నాకు తుగ్గలి మండలం రాతన సర్వే నంబర్ 363లో 3 ఎకరాల పొలం ఉంది. దానిని రీసర్వే చేసే సమయంలో కనీసం సమాచారం ఇవ్వలేదు. తీరా రికార్డుల్లో చూస్తే 2.52 ఎకరాలు మాత్రమే ఎక్కించారు. మిగిలిన భూమి ఎక్కడి వెళ్లిందంటే ఎవరూ చెప్పడంలేదు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. పనులు మానుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కురువ మారుతి, రాతన, తుగ్గలి మండలం
26 నుంచి ప్రత్యేక క్యాంపులు


