భారతి సిమెంట్ ఆధ్వర్యంలో వేడుకలు
కర్నూలు (అగ్రికల్చర్): భారతి సిమెంట్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వివిధ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్ట్ చర్చి, రాక్‌వుడ్ మెమోరియల్ చర్చి, కోల్స్ సెంటీనియల్ చర్చి, స్టాంటన్ మెమోరియల్ చర్చి, బిషప్ చర్చి, ఏబీఎం చర్చిలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. భారతి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మల్లారెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని వివిధ చర్చిలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతి సిమెంట్ కర్నూలు జిల్లా అధికారి షేక్ ఇక్బాల్, సాంకేతిక అధికారి ఉదయ్ కుమార్, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.


