నకిలీ విత్తు నట్టేట ముంచింది!
ముడుమలగుర్తిలో కాపులేని కంది పంటను తొలగించిన దృశ్యం
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో కొచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనం మొదలు పంట విక్రయం వరకు అవస్థలే. తాజాగా కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామానికి చెందిన పలువురు రైతులు నకిలీ కంది విత్తనాల సాగుతో నష్టపోయారు. పైరు ఏపుగా పెరిగింది కానీ పూత, బుడ్డ రాలేదు. దీంతో ఐదెకరాల్లో దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను మహేశ్వరరెడ్డి అనే రైతు బుధవారం తొలగించాడు. కోడుమూరులోని ఓ దుకాణదారుడు మంచి విత్తనాలు అని చెప్పడంతో నమ్మి సాగు చేసి మోసపోయామని బాధిత రైతులు వాపోయారు
– కోడుమూరు రూరల్
నకిలీ విత్తు నట్టేట ముంచింది!


