సాతనూరు..వలసవెళ్తోంది!
మూటముల్లె సర్దుకొని వలసపోతున్న దృశ్యం
పైచిత్రంలోని వారు కోసిగి మండలం సాతనూరు గ్రామస్తులు. వీరు ఏనాడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లరు. తుంగభద్రనదికి సమీపంలోనే ఊరు ఉండటంతో రెండుకార్ల పంటలు పండించుకుంటూ రైతులు, పనులు చేసుకుంటూ కూలీలు జీవనం సాగిస్తారు. అయితే, ఈసారి నదికి నీళ్లు వదలకపోవడంతో పొలాలు బీళ్లుగా మారాయి. దీంతో స్థానికంగా పనులు లేకపోవడంతో మూట ముల్లె సర్దుకొని పిల్లాపాపలతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నట్లు తమ దుస్థితిని వెలిబుచ్చారు. –కోసిగి


