రోడ్లపై గుంతలు పూడ్చిన పోలీసులు
కోడుమూరు రూరల్: మండలంలోని ప్యాలకుర్తి నుంచి గూడూరుకు వెళ్లే రోడ్డు దెబ్బతిని అధ్వానంగా ఉంది. అడుగడుగునా గుంతలున్నాయి.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మరోవైపు వాహనదారులు ఆ గుంతల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నా రు. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్‌ఐ రాజ కుళ్లాయప్ప స్పందించి బుధవారం రహదారి మ రమ్మతుకు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్లతో ఎర్రమట్టిని తోలించి రోడ్డుపైపడిన గుంతలనుపూడ్చివేయించారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు పోలీసులు చేపట్టి న మరమ్మతు పనులను చూసి హర్షం వ్యక్తం చేశారు.


