తాటి చెట్టు పైనుంచి కింద పడి వ్యక్తి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం తాటిచెట్టుపై నుంచి పడి తెలుగు బత్తలయ్య (44) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన తాటి నుంజల వ్యాపారం చేసుకుంటు జీవన సాగించేవాడు. ఇందులో భాగంగానే చెట్టుపైకి ఎక్కి తాటి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య చిట్టెమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


